: 'మాజీ గవర్నర్ల పెన్షన్ పెంపు బిల్లు'కు లోక్ సభ ఆమోదం
మాజీ గవర్నర్లకు ఇచ్చే భత్యాలు, పెన్షన్ పెంచుతూ రూపొందించిన బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును సభలో మంత్రి ఆర్ పీఎన్ సింగ్ ప్రవేశపెట్టారు. '2012- గవర్నర్స్ సవరణ బిల్లు' ప్రకారం మాజీ గవర్నర్లు ఆసుపత్రి సౌకర్యాలు తప్ప ఎలాంటి పెన్షన్ పొందలేరని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నిబంధనలు విధించింది. అయితే, దేశ ప్రజలకు వారు చేసిన సేవలను దృష్టిలో పెట్టుకుని పదవినుంచి వైదొలగిన తర్వాత కూడా జీవితాంతం పెన్షన్ ను ఇవ్వాలని నిర్ణయించినట్లు సింగ్ సభలో వెల్లడించారు. ఒకవేళ వారు కేంద్ర, రాష్ట్రాలలో ఏదైనా పదవిలో ఉంటే ఆ సమయంలో ఈ పెన్షన్ వర్తించదన్నారు. దీని కింద ప్రతి ఒక్కరికీ రూ.28వేలు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇందుకు ప్రతిపక్షం అడ్డు చెప్పదని అనుకుంటున్నానన్నారు.