: సమైక్యాంధ్ర ఎఫెక్ట్... ఇక సీమాంధ్ర నేతల ఇళ్లకు విద్యుత్ బంద్: విద్యుత్ జేఏసీ


సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తోంది. సీమాంధ్రకు చెందిన 13 జిల్లాల్లో వివిధ రూపాల్లో నిరసనలు, ఆందోళనలతో సమైక్యవాదులు కదం తొక్కుతున్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 2 నుంచి సీమాంధ్ర ప్రజాప్రతినిధుల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్టు సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ తెలిపింది. ప్రజాప్రతినిధులు తక్షణం తమ పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనాలని విద్యుత్ జేఏసీ డిమాండ్ చేసింది. రాష్ట్రాన్ని విభజిస్తే తెలంగాణ ప్రాంతానికే విద్యుత్ కష్టాలు వస్తాయని సీమాంధ్ర విద్యుత్ జేఏసీ నేతలు తెలిపారు.

  • Loading...

More Telugu News