: '90 శాతం భారతీయులు మూర్ఖులు..' వ్యాఖ్యలపై కట్జూ క్షమాపణ
'భారతదేశంలో తొంబైశాతం మంది మూర్ఖులే'నంటూ గతంలో తాను చేసిన వ్యాఖ్యలపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్ పర్సన్ జస్టిస్ మార్కండేయ కట్జూ క్షమాపణ చెప్పారు. తన వ్యాఖ్యలు ఎవరివైనా భావాలను బాధించి ఉంటే వారందరికీ క్షమాపణలు చెబుతున్నానన్నారు. ఇటువంటి ప్రకటనలు కొన్ని సందర్భాలలో చేసినవే కానీ, ఎవరినీ బాధించాలని కాదని తెలిపారు. కొన్ని నెలల కిందట ఓ మీటింగులో మాట్లాడుతూ కట్జూ చేసిన ఈ వ్యాఖ్యలపై దేశంలో పెద్ద దుమారమే చెలరేగింది.