: తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కూడా ఓ కమిటీ వేస్తుంది: సోనియా గాంధీ
తెలంగాణపై ప్రకటన నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతాల సమస్యలు వినేందుకు కాంగ్రెస్ పార్టీ ఆంటోనీ కమిటీ వేసినట్టుగానే కేంద్ర ప్రభుత్వం కూడా ఓ కమిటీ వేస్తుందని యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ తెలిపారు. ఢిల్లీలో ఆమె మాట్లాడుతూ సీమాంధ్రుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఓ కమిటీ వేస్తుందన్నారు. కానీ ఆ కమిటీ విధివిధానాలను వెల్లడించలేదు.