: సైకిల్ దిగి జగన్ పార్టీలో చేరుతున్న తమ్మినేని సీతారాం


టీడీపీ నేత తమ్మినేని సీతారాం పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీకి రాజీనామా చేసిన ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్సార్సీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు పార్టీ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు స్పష్టమైన సమాచారం. ఈ విషయాన్ని ఆయన సోమవారం తర్వాత ప్రకటిస్తారని అంటున్నారు. ఈ మేరకు రెండు రోజుల్లో జైల్లో జగన్ ను సీతారాం కలవనున్నారని సమాచారం. గతంలో టీడీపీ నుంచి చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యంలోకి వెళ్లిన ఆయన మళ్లీ టీడీపీలోకే వచ్చారు. శ్రీకాకుళం జిల్లా నేత అయిన తమ్మినేని స్థానికంగా తెలుగుదేశం అంతగా పుంజుకోకపోవడం వంటి పలు కారణాల వల్లే రాజీనామా చేసినట్లుగా వినిపిస్తోంది.

  • Loading...

More Telugu News