: సిరియాపై దాడికి గల అవకాశాలను పరిశీలిస్తున్న అమెరికా
సిరియాపై దాడికి తమ అధ్యక్షుడి నుంచి ఆదేశాలు రావచ్చని అమెరికా రక్షణ శాఖ అంచనా వేస్తోంది. ఇటీవలే సిరియా సైనిక దళాలు అమాయక ప్రజలపై రసాయన వాయువులను ప్రయోగించి వందల సంఖ్యలో పసిపిల్లల మరణాలకు కారణమయ్యాయన్న ఆరోపణల నేపథ్యంలో అమెరికా వేసే ఎత్తుగడలకు ప్రాధాన్యం ఏర్పడింది. సిరియాకు వ్యతిరేకంగా తమ దేశం చేపట్టదగిన అన్ని రకాల చర్యలపై ఒక నివేదికను తయారు చేయాల్సిందిగా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆదేశాలు జారీ చేసినట్లు ఆ దేశ రక్షణ మంత్రి చక్ హేగెల్ తెలిపారు. అయితే సిరియాలో దాడి అవకాశాలపై స్పందించడానికి ఆయన నిరాకరించారు. కాగా, మధ్యదరా సముద్రంలో అమెరికా నావికాదళాలు గస్తీని పెంచాయని తెలుస్తోంది.