: రామేశ్వరంలో హై అలర్ట్.. భారీ భద్రత


ఎప్పుడూ ఆధ్యాత్మిక, భక్తి భావంతో నిండి ఉండే తమిళనాడులోని రామేశ్వరం పట్టణంలో పరిస్థితి గంభీరంగా మారిపోయింది. 12 మంది ఉగ్రవాదులు ట్యూటికోరిన్ జిల్లాలోని మనియాచి నుంచి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఇంటెలిజెన్స్ విభాగం నుంచి హెచ్చరికలు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సాయుధ పోలీసులు బస్టాండ్, రైల్వే స్టేషన్, రామనాథ స్వామి ఆలయం తదితర రద్దీ ప్రదేశాలలో కాపలా కాస్తున్నారు. పట్టణంలోకి వచ్చే ప్రతీ వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. కీలకమైన ప్రాంతాలలో అత్యవసరంగా సీసీటీవీ కెమేరాలను ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రైల్వే రక్షక దళం పోలీసులు కూడా రంగంలోకి దిగారు. పట్టణంలోకి వస్తున్న ప్రతీ రైలును, ప్రయాణికులను తనిఖీలు చేస్తున్నారు. ఇక్కడ రామనాథ స్వామి కొలువై ఉన్న సంగతి తెలిసిందే. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇది కూడా ఒకటి.

  • Loading...

More Telugu News