: 36 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ వెల్ లోకి వెళ్లలేదు: కనుమూరి
తన 36 ఏళ్ల రాజకీయ జీవితంలో లోక్ సభలో స్పీకర్ వెల్ లోకి ఎప్పుడూ వెళ్లలేదని ఎంపీ కనుమూరి బాపిరాజు తెలిపారు. న్యూఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, సీమాధ్ర ప్రాంత ప్రజల ఆందోళనలను సభ దృష్టికి తీసుకువెళ్లానని అన్నారు. ప్రజా సమస్యలను పార్లమెంటు దృష్టికి తీసుకువెళ్లడం తప్పుకాదని అన్నారు. గతంలో మహానుభావులనదగ్గ నేతలు కూడా వివిద రూపాల్లో తమ నిరసన తెలిపారన్నారు. తాను సస్పెండైనా సీమాంధ్ర ప్రాంత ప్రజల ఆందోళనను సభ దృష్టికి తీసుకెళ్లానని అన్నారు.