: రూపాయి పతనంపై విదేశీ మదుపుదారులతో చిదంబరం భేటీ


రూపాయి విలువ రోజురోజుకూ క్షీణిస్తూ వాణిజ్య వర్గాలలో ఆందోళన రేకెత్తిస్తుండడంతో కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం నష్ట నివారణ చర్యలు మొదలు పెట్టారు. విదేశీ సంస్థాగత మదుపుదారులతో ఆయన ముంబైలో భేటీ అయ్యారు. ఈ భేటీలో మెరిల్ లించ్, టెమాసెక్, హెచ్ ఎస్ బీసీ, సిటీ బ్యాంకు, డాయిష్ బ్యాంకు తదితర అగ్రగామి సంస్థల ఫండ్ మేనేజర్లు పాల్గొన్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో వారి నుంచి సూచనలు, సలహాలను చిదంబరం స్వీకరించారు. వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశానికి ముందు ఆయన బ్యాంకింగ్ రంగ ప్రముఖులతో కూడా సమావేశమై తాజా పరిస్థితులపై చర్చించారు.

  • Loading...

More Telugu News