: హెచ్ పీసీఎల్ మృతులు 8 మంది


విశాఖ హెచ్ పీసీఎల్ ప్రమాదంలో మృతుల సంఖ్య 8 కి చేరింది. ప్రమాద స్థలంలో మరో నాలుగు మృత దేహాలు లభ్యమయ్యాయి. తీవ్రంగా గాయపడిన 36 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. హిందుస్థాన్ పెట్రో కెమికల్స్ లిమిటెడ్ లో నిన్న సాయంత్రం కూలింగ్ టవర్ పేలి భారీ అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. సంఘటనా స్థలంలో నిన్న రెండు మృత దేహాలు లభ్యం కాగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. ప్రమాద స్థలంలో మరో నాలుగు మృత దేహాలను గుర్తించారు. దీంతో మృతుల సంఖ్య 8 కి చేరింది.

పెట్రోలియం, రసాయనాల శాఖ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి ప్రమాద తీవ్రతపై సమాచారం తెలుసుకున్నారు. రిఫైనరీలో తరచు చోటుచేసుకుంటున్న ప్రమాదాలతో ప్రభావితమవుతున్న శ్రీహరిపురం వాసులు పెద్ద ఎత్తున రిఫైనరీ ప్రధాన ద్వారం వద్దకు చేరుకుని ధర్నా నిర్వహించారు. మరో వైపు ప్రమాద మృతులకు నష్టపరిహారం ఇవ్వాలంటూ కార్మికులను విధుల్లోకి వెళ్లకుండా సీఐటీయూ నాయకులు అడ్డుకున్నారు. దీంతో 3 వేల మంది కార్మికులు విధులకు దూరమయ్యారు.

  • Loading...

More Telugu News