: కర్ణాటక ఉప ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు


కర్ణాటకలో జరిగిన లోక్ సభ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ నెల 21న మాండ్య, బెంగళూరు రూరల్ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. మాండ్యలో కాంగ్రెస్ అభ్యర్థి సినీ నటి రమ్య (దివ్య స్పందన) జేడీఎస్ అభ్యర్థి సి.యస్ పుట్టరాజుపై 47,000కు పైగా ఓట్ల మెజారిటితో గెలుపొందారు. బెంగళూరు రూరల్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డి.కె. సురేష్ కుమార్, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమార స్వామి భార్య అనితా కుమారస్వామిపై లక్ష ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.

మాండ్య, బెంగళూరు రూరల్ స్థానాలు జనతాదళ్ (సెక్యులర్)కు పెట్టని కోటలుగా పేరున్నవి. అయితే, ఈ రెండింటినీ భారీ మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థులు తమ సొంతం చేసుకున్నారు. అసెంబ్లి ఎన్నికలలో గెలిచిన అనంతరం హెచ్.డి కుమార స్వామి బెంగళూరు రూరల్ స్థానానికి, మరో జేడియస్ ఎంపీ ఎన్ చెలువరస్వామి మాండ్య స్థానానికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు నిర్వహించారు. ఈ విజయం ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మరింత బలాన్నిచ్చింది.

  • Loading...

More Telugu News