: అవనిగడ్డ ఉపఎన్నికలో టీడీపీ అభ్యర్థి అంబటి శ్రీహరి ప్రసాద్ ఘనవిజయం
కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు పూర్తైంది. 21 రౌండ్ల పాటు జరిగిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే సరికి టీడీపీ అభ్యర్థి, దివంగత అంబటి బ్రహ్మణయ్య కుమారుడు అంబటి శ్రీహరి ప్రసాద్ 61,643 ఓట్లతో ఘనవిజయం సాధించారు. ఈ ఎన్నికలో అధికార పార్టీలన్నీ పోటీకి దూరంగా ఉండగా ఇండిపెండెంట్ అభ్యర్థులు ఇద్దరు బరిలో నిలిచారు. వారిద్దరూ ఘోర పరాజయం పాలయ్యారు. దీంతో టీడీపీలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.