: మహిళా ఫోటో జర్నలిస్టుపై అత్యాచారాన్ని ఖండించిన సోనియాగాంధీ
ముంబయిలో మహిళా ఫోటో జర్నలిస్టుపై ఐదుగురు కామాంధులు దారుణానికి ఒడిగట్టడాన్ని యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ ఖండించారు. ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన సోనియా, జర్నలిస్టుపై అత్యాచారం అత్యంత హేయమని పేర్కొన్నారు. ఢిల్లీలో 'జాతీయ మీడియా కేంద్రం' ప్రారంభం సందర్భంగా ప్రసంగించిన ఆమె పైవిధంగా స్పందించారు. యూపీఏ-2 పూర్తికాలం కొనసాగుతుందని, ముందస్తు ఎన్నికలకు అవకాశం లేదని ధీమా వ్యక్తం చేశారు.