: హైదరాబాద్ లో సంపన్న తాగుబోతుల విధ్వంసం


'తాగి వాహనాలను నడపకండి.. ప్రాణాలను రిస్కులో పెట్టకండి' అంటూ హైదరాబాద్ పోలీసులు ఎన్నాళ్లుగానో విజ్ఞప్తి చేస్తున్నారు. డ్రంకెన్ డ్రైవ్ పేరుతో తినిఖీలు నిర్వహిస్తూ అరదండాలు వేస్తున్నారు. జరిమానాలతో దారికి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, 'తాగను.. తాగితే నే ఎవరి మాటా వినను' అన్నట్లుగా తాగుబోతులు పీకల దాకా పట్టించి వాహనాలలో రయ్ మంటూ పోతునే ఉన్నారు. ముఖ్యంగా సంపన్న వర్గాల యువత ఈ విధంగా వ్యవహరిస్తోంది.

నిన్న రాత్రి బంజారాహిల్స్ ప్రాంతంలో ఇలానే తాగుబోతులు కారుతో విధ్వంసం సృష్టించారు. రోడ్డు నంబర్ 12లో పోలీస్ స్టేషన్ సమీపంలో అర్ధరాత్రి వేళ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. వేగంగా వచ్చిన ఒక కారు పోలీసులు అడ్డుగా నిలిపిన బారీ కేడ్లను ఢీకొట్టి.. అనంతరం ద్విచక్ర వాహనాన్ని డాష్ ఇచ్చింది. తర్వాత అదే వేగంతో ద్విచక్ర వాహనదారుడి మీద నుంచి కారు ముందుకు వెళ్లిపోయింది. ఆ సమయంలో యువతి వాహనాన్ని నడుపుతోంది. వాస్తవానికి కారులో ఉన్న యువకుడు వాహనాన్ని నడపుతూ పోలీసులను చూసి అందులోనే ఉన్న యువతికి కారునిచ్చి పక్కకు జరిగాడు. దీన్ని పోలీసులు గుర్తించి ఆపే ప్రయత్నం చేయగా ప్రమాదం జరిగింది. మరి ఆ యువతికి కారు డ్రైవింగ్ రాదో, లేకుంటే అమ్మడు కూడా ఫుల్ గా పట్టించిందోగానీ, అడ్డదిడ్డంగా డ్రైవ్ చేసి ప్రమాదానికి కారణమైంది.

  • Loading...

More Telugu News