: నిందితులను కఠినంగా శిక్షించాలి: ముంబయి అత్యాచార యువతి


తనపై అత్యాచారానికి పాల్పడిన ఐదుగురు నిందుతులను కఠినంగా శిక్షించాలని ముంబయి మహిళా ఫోటో జర్నలిస్టు కోరినట్లు ఆమె బంధువులు మీడియాకు తెలిపారు. ఘటన గురించి చాలా ధైర్యంగా వివరించిన యువతి మొదట తనపై జరిగిన దారుణం గురించి తల్లిదండ్రులకు ఏమి చెప్పలేదన్నారు. తనకేదో చిన్న ప్రమాదం జరిగిందని, విషయం తెలిస్తే తన తల్లికి ఏమైనా అవుతుందోమోనని చెప్పలేదని బంధువులు వెల్లడించారు.

అయితే, ఆసుపత్రికి వచ్చాక విషయం తెలుసుకున్న యువతి తల్లి స్పృహ కోల్పోయిందన్నారు. ప్రస్తుతం బాధితురాలు తల్లి గురించే ఆలోచిస్తుందని వివరించారు. నిందితులు ముందుగా తన వద్ద ఉన్న విలువైన వస్తువులు తీసుకున్న అనంతరం, తనపై అత్యాచారానికి పాల్పడ్డారని, తర్వాత తన వస్తువులు ఇచ్చేసినట్లు చెప్పిందన్నారు. మరోవైపు బాధితురాలి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నిందితులను వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News