: బుద్ధుడు కూడా లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్నాడు: ఆశారాం
స్వయం ప్రకటిత భగవానుడిగా చెలామణీ అవుతున్న ఆశారాం బాపు లైంగిక ఆరోపణలపై వినూత్నంగా స్పందించారు. 'గౌతమ బుద్ధుడు కూడా లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్నాడు. నేను అమాయకుడిని. తప్పు చేస్తే దాన్ని నిరూపించండి' అని ఆశారాం అన్నారు. రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో ఆశారాం ఆశ్రమానికి చెందిన హాస్టల్లో ఉండే 16 ఏళ్ల బాలిక తనపై ఆశారం అత్యాచారానికి పాల్పడ్డారంటూ పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ఆరంభించారు. కానీ, ఇంతవరకు ఆశారాంను ప్రశ్నించలేదు. ఆధ్యాత్మిక వేడుక ఉందంటూ తనను ఒక గదిలోకి తీసుకెళ్లి ఆశారాం అత్యాచారం చేసినట్లుగా బాలిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. బాపూ ఆశారాంకు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో ఆశ్రమాలు ఉన్నాయి.