: నేతలకు పదవుల గోల తప్ప, ప్రజల బాధ పట్టడం లేదు: సీపీఎమ్ రాఘవులు
నిత్యావసర ధరలకు రెక్కలు వస్తున్నా, వాటిని అదుపు చేసే పరిస్థితిలో పాలకులు లేరని సీపీఎమ్ కార్యదర్శి రాఘవులు ఆరోపించారు. హైదరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద చేపట్టిన ధర్నాలో మాట్లాడుతూ, నేతలకు పదవులు కాపాడుకోవడంలో ఉన్న శ్రద్థ ధరలను అదుపు చేయడంలో లేదని ఆయన మండిపడ్డారు. కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు అదుపు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తక్షణం ధరలు తగ్గించకుంటే ఆందోళన మరింత తీవ్రం చేస్తామని రాఘవులు హెచ్చరించారు.