: ఈ ఏడాది రైల్వేల నష్టం రూ.25వేల కోట్లు ఉండే అవకాశం
ప్రయాణికుల విభాగంలో ఈ సంవత్సరం రైల్వే నష్టం రూ.25వేల కోట్లు ఉండే అవకాశం ఉందని రైల్వే శాఖ సహాయమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి రాజ్యసభలో తెలిపారు. కాగా, ప్రయాణికుల ఛార్జీల ద్వారా వచ్చే లోటును రవాణా సంబంధిత ఆదాయంతో పూడుస్తున్నట్టు, ఓ లిఖిత పూర్వక సమాధానంలో మంత్రి చెప్పారు. రైల్వే రవాణా సేవలు, చార్జీలు పారదర్శకంగా ఉండేందుకు త్వరలో రైల్వే టారిఫ్ అథారిటీని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు మంత్రి తెలియజేశారు.