: అడ్డంగా బుక్కయిన లంచగొండి ఎస్సై
లంచాలు మరిగిపోయిన ఓ ఎస్సై ఇప్పుడు అడ్డంగా బుక్కయిపోయాడు. హైదరాబాద్ నల్లకుంట పోలీస్ స్టేషన్ లో బాధితుడి నుంచి లంచం తీసుకుంటూ ఎస్సై మస్తాన్ వలి ఏసీబీ అధికారులకు చిక్కాడు. రోడ్డు ప్రమాదం కేసుకు సంబంధించి ద్విచక్రవాహనాన్ని విడిపించుకునేందుకు చిరంజీవి అనే వ్యక్తి నుంచి ఎస్సై పది వేలు డిమాండ్ చేశాడు. 9 వేల రూపాయలకు ఒప్పందం కుదిరాక బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ప్రణాళిక ప్రకారం వలపన్నిన ఏసీబీ అధికారులు ఎస్సైని అదుపులోకి తీసుకున్నారు.