: ఫైళ్ల గల్లంతుపై చెరొక మాట చెబుతున్న బొగ్గు శాఖ, సీబీఐ


బొగ్గు శాఖలో ఎన్ని ఫైళ్లు గల్లంతయ్యాయన్న లెక్కపై బొగ్గు శాఖ, సీబీఐ చెరొక మాట చెబుతున్నాయి. దీనిపై బొగ్గు శాఖ మంత్రి శ్రీ ప్రకాశ్ జైస్వాల్ రాజ్యసభలో మాట్లాడుతూ.. ఏడు ఫైళ్లు కనిపించడంలేదని చెప్పారు. అయితే, సీబీఐ మాత్రం మొత్తం 225 ఫైళ్లు కనిపించడం లేదని చెబుతోంది. ఇప్పటికే తాము నమోదు చేసిన 13 ఎఫ్ఐఆర్ లకు సంబంధించిన కేసులను పర్యవేక్షించడానికి ఈ ఫైళ్ళు అవసరమవుతాయని సీబీఐ చెప్పింది. ఇప్పటికే ఫైళ్లు కనిపించకుండా పోవడంపై పార్లమెంటులో ప్రధాని వివరణ ఇవ్వాలని ప్రతిపక్షాలు తీవ్రంగా పట్టుబట్టాయి. దాంతో, ప్రధాని వివరణ ఇస్తారని ప్రభుత్వం చెప్పింది.

  • Loading...

More Telugu News