: భర్త దీక్ష భగ్నం.. నిరసనగా భార్య దీక్ష
పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథ రెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేసి ఆసుపత్రికి తరలించారు. సమైక్యాంధ్రను కోరుతూ ఐదు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న పల్లె రఘునాథ రెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేయడానికి నిరసనగా ఆయన భార్య ఉమ నిరాహార దీక్షకు దిగారు. ఆమెకు టీడీపీ కార్యకర్తలు, సమైక్యాంధ్ర ఉద్యమకారులు మద్దతు పలికారు.