: సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఉద్యమబాట పట్టాలి: పయ్యావుల


సీమాంధ్రుల్ని చులకన చేసేలా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీపై కేంద్ర మంత్రులు ఉద్యమబాట పట్టాలని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో మాట్లాడిన ఆయన, లోక్ సభలో ఎలాంటి చర్చలేకుండా ఎంపీలను సస్పెండ్ చేయడం అమానుషం అన్నారు. 20 రోజులుగా సీమాంధ్ర ప్రజలు చేస్తున్న ఆందోళనల్ని పట్టించుకోకుండా తెలుగువారిని కాంగ్రెస్ అవమానిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమాంధ్ర ప్రాంత మంత్రులు ఇకనైనా ఉద్యమబాట పట్టి ప్రజల్లో మమేకమవ్వాలని పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News