: కేసీఆర్ ది సమైక్యవాదం: జగ్గారెడ్డి


సీమాంధ్రలో ఉద్యమం చేసేవాళ్లను రెచ్చగొట్టి, తద్వారా రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు కేసీఆర్ కుటుంబం కుట్రపన్నుతోందని కాంగ్రెస్ విప్ జగ్గారెడ్డి అన్నారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ సీమాంధ్ర ఉద్యమవాదులను రెచ్చగొట్టేలా కేసీఆర్ కుటుంబం మాట్లాడుతోందని ఆరోపించారు. రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణలో భూముల రేట్లు బాగా పడిపోతాయని, అందుకే రాష్ట్రం విడిపోకుండా ఉండేందుకు అడ్డుపుల్లలు వేస్తోందని ఆయన ఆరోపించారు. రకరకాల నాటకాలతో తెలంగాణను భ్రష్టుపట్టించేలా టీఆర్ఎస్ వ్యవహరిస్తోందని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రా మూలాలున్న కేసీఆర్ ది సమైక్యవాదంలా కనిపిస్తోందని ఆరోపించారు.

  • Loading...

More Telugu News