: ఏటా రూ.44వేల కోట్ల విలువైన ఆహారం వృధా: శరద్ పవార్
ప్రతి సంవత్సరం భారతదేశంలో రూ.44వేల కోట్ల ఆహారం వృధా అవుతోందని వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ తెలిపారు. నిల్వ చేసేందుకు తగినంత మౌలిక సదుపాయాలు లేకపోవడంతో పండ్లు, ధాన్యాలు, కూరగాయలు వృధాగా పోతున్నాయని క్వశ్చన్ అవర్ లో మంత్రి రాజ్యసభకు తెలిపారు. సంవత్సరం మొత్తం మీద రూ.13,309 పండ్లు, కూరగాయలు వ్యర్ధమవుతున్నాయని వివరించారు. అయితే, అదనపు నిల్వ సామర్ధ్యం కోసం ప్రభుత్వం ఇప్పటికే తగిన చర్యలు తీసుకుందన్నారు. 61.3 మిలియన్ టన్నుల నిల్వకోసం తగినంత కోల్డ్ స్టోరేజ్ అవసరమని 2012లో ప్రణాళిక సంఘం ఏర్పాటు చేసిన 'సౌమిత్రి ఛౌదరి కమిటి' సూచించిందని మంత్రి చెప్పారు.