: సమస్యపై పోరాడితే వేటా?: సుజనా చౌదరి
ప్రజా సమస్యలపై పోరాడితే వేటు వేస్తారా? అని కేంద్రాన్ని టీడీపీ ఎంపీ సుజనా చౌదరి ప్రశ్నించారు. ఢిల్లీలో టీడీపీ రాజ్యసభ ఎంపీలు మాట్లాడుతూ తమ లోక్ సభ ఎంపీల సస్పెన్షన్ పై రాజ్యసభలోనూ పోరాటం చేస్తామని తెలిపారు. అందులో భాగంగా తమను సస్పెండ్ చేసినా, సాయంత్రం 6 గంటల వరకు సభలోనే నిరసనలు తెలుపుతామని సుజనాచౌదరి స్పష్టం చేశారు. సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలకోసం తమ పోరాటం సాగుతుందని వీరు స్పష్టం చేశారు. సోనియా, విజయమ్మ లాలూచీ పడి దీక్ష నాటకాలు ఆడుతున్నారని మరో ఎంపీ సీఎం రమేష్ మండిపడ్డారు.