: సీమాంధ్ర సమ్మె వల్ల 200 కోట్ల రూపాయల నష్టం: ఏకే ఖాన్


సీమాంధ్రలో ఆర్టీసీ కార్మికుల సమ్మెవల్ల రోజుకు 13 కోట్ల రూపాయల చొప్పున నష్టం వస్తోందని ఆర్టీసీ ఎండీ ఏకే ఖాన్ తెలిపారు. హైదరాబాద్ లో ఆర్టీసీ నేతలతో చర్చల సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీమాంధ్రలో సమ్మె వల్ల సంస్థకు ఇప్పటి వరకు 200 కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లిందని తెలిపారు. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి సంక్లిష్టంగా ఉందని, సమ్మె కొనసాగితే సంస్థ మనుగడే ప్రశ్నార్ధకమవుతుందని ఆయన అన్నారు. సంస్థ ఆర్ధిక పరిస్థితి, ప్రయాణీకుల ఇబ్బందుల దృష్ట్యా సమ్మె తక్షణం విరమించాలని కార్మిక సంఘాల నేతలను ఆయన కోరారు.

  • Loading...

More Telugu News