: మహా కుంభమేళా భక్తులతో కిటకిట


అలహాబాద్ లో ఘనంగా నిర్వహిస్తున్న మహా కుంభమేళా సోమవారం భక్తులతో కిటకిటలాడింది. ఈరోజు మాఘ పౌర్ణమి కావడంతో భక్తులు భారీ సంఖ్యలో కుంభమేళాకు తరలివచ్చారు. దేశం నలుమూలల నుంచి విచ్చేసిన భక్తులు తెల్లవారు జాము నుంచే త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు.

కాగా, మౌని అమావాస్య సందర్బంగా తొక్కిసలాట చోటు చేసుకుని పలువురు మృతి చెందిన నేపథ్యంలో మరోసారి అలాంటి దుర్ఘటన పునరావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. మాఘ పౌర్ణమి సందర్బంగా కోటి మందికి పైగా భక్తులు కుంభమేళాకు రానున్నారని అధికారుల అంచనా. 

  • Loading...

More Telugu News