: బాబూ... సీమాంధ్రలో అడుగుపెడితే ఖబడ్దార్: గుర్నాథ రెడ్డి
రాష్ట్ర విభజనకు ప్రధాన కారకుడైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీమాంధ్ర ప్రాంతంలో అడుగుపెడితే తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి ఉంటుందని అనంతపురం ఎమ్మెల్యే గురునాథ రెడ్డి హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బాబు లేఖ ఇచ్చినందు వల్లే తెలంగాణకు అనుకూలంగా ప్రకటన వెలువడిందని అందుచేత ఆ లేఖను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేఖను వాపస్ తీసుకున్న తరువాతే సీమాంధ్రలో యాత్రల డ్రామాలు ఆడాలని ఆయన సూచించారు. సీమాంద్ర రాజకీయ పార్టీల నేతలకు విభజన విషయం ముందే తెలుసని, కానీ ఏమీ తెలియనట్టు పార్లమెంటులో కొత్త నాటకాలు ఆడుతున్నారని ఆయన విమర్శించారు.