: సీమాంధ్ర ఆర్టీసీ కార్మిక సంఘాలతో బొత్స చర్చలు
సీమాంధ్రలో ఆర్టీసీ సమ్మె విరమింపజేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. సమ్మెలో పాల్గొన్న కార్మికసంఘాల నేతలతో మంత్రుల నివాస ప్రాంగణంలో రవాణాశాఖా మంత్రి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ చర్చలు జరుపుతున్నారు. అయితే ఏపీఎన్జీవోల పిలుపు మేరకు సమ్మెకు దిగిన ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెను విరమిస్తారా? లేదా? అన్నది చూడాల్సిఉంది. అధిష్ఠానం సూచనలు, కోర్టు ప్రశ్నల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర ఉద్యమాన్ని నీరుగార్చే కుట్రపన్నుతోంది. అయితే ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతుండడంతో ఉద్యోగులు నేతల మాటవింటారా? అనేది ప్రశ్నార్ధకంగా మారింది.