: లోక్ సభ అరగంట వాయిదా
తొలి వాయిదా అనంతరం ప్రారంభమైన లోక్ సభ సీమాంధ్ర నినాదాలతో దద్దరిల్లుతోంది. సీమాంధ్ర ఎంపీల నినాదాలతో వాయిదా పడ్డ లోక్ సభ రెండోసారి కూడా వారి ధాటికి అర్థగంట వాయిదా పడింది. చిదంబరం కీలక చర్చకు తెరతీస్తుండగా సీమాంధ్రకు చెందిన ఎంపీలు సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియం ను చుట్టుముట్టారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయొద్దంటూ, సీమాంధ్రకు న్యాయం చేయాలంటూ నినాదాలతో హోరెత్తించారు. దీంతో లోక్ సభ అరగంట వాయిదా పడింది.