: బెజవాడలో భారీ సమైక్య ర్యాలీ
సీమాంధ్ర హక్కుల పరిరక్షణ కోసం, రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ విజయవాడలో తెలుగు యువత ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. చుట్టుగుంట కూడలి నుంచి వేలాది మంది విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. బెజవాడలో స్వచ్ఛందంగా విద్యాసంస్థలను మూసివేసిన యజమానులు విద్యార్థులతో కదంతొక్కారు. సమైక్య నినాదలతో హోరెత్తిస్తూ రామవరప్పాడు కూడలి వరకు ర్యాలీ తీసారు. వీరికి పలు సంఘాల ప్రజలు మద్దతు పలికారు.