: కడపలో ఎమ్మెల్యే లింగారెడ్డి దీక్ష
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ టీడీపీ పత్యక్ష ఆందోళనకు సిద్దమైంది. వైఎస్సార్ సీపీకి కంచుకోటగా భావిస్తున్న కడప జిల్లానుంచి టీడీపీ ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తొంది. అందులో భాగంగా రాష్ట్ర సమైక్యతను కోరుతూ కడప కలెక్టరేట్ వద్ద టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే లింగారెడ్డి నిరవధిక దీక్షకు దిగారు. ఎన్టీఆర్ సర్కిల్ లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీగా దీక్షా శిబిరం వద్దకు చేరుకుని పార్టీ శ్రేణుల సమక్షంలో నిరవధిక దీక్ష చేపట్టారు. ఎమ్మెల్యే లింగారెడ్డితో పాటు పార్టీ నేత బాలకృష్ణ యాదవ్ కూడా దీక్ష చేస్తున్నారు.