: ఆస్కార్ ఉత్తమ చిత్రం 'ఆర్గో'
ప్రతిష్ఠాత్మక ఆస్కార్ ఉత్తమ చిత్రం అవార్డును 'ఆర్గో' సినిమా గెలుచుకుంది. ఉత్తమ చిత్రం నామినేషన్లను, అవార్డును అమెరికా అధ్యక్షుడు ఒబామా భార్య మిచెల్లీ వైట్ హౌస్ నుంచి ప్రకటించడం విశేషం. భారతీయ నేపథ్యంలో నిర్మించిన 'లైఫ్ ఆఫ్ పై' చిత్రానికి ఈ విషయంలో నిరాశ మిగిలింది. కాగా, ఉత్తమ నటుడు అవార్డును డేనియల్ డే లెవిస్ (చిత్రం: లింకన్), ఉత్తమ నటి అవార్డును జెన్నిఫర్ లారెన్స్ (చిత్రం: సిల్వర్ లైనింగ్స్ ప్లే బుక్) దక్కించుకున్నారు.