: 144 సెక్షన్ మధ్య విశాఖలో ఎంసెట్ కౌన్సిలింగ్
సమైక్యాంధ్రకు మద్దతుగా గత ఐదు రోజులుగా ఉద్యోగులు ఎంసెట్ కౌన్సిలింగ్ నిలిపివేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో ఈ రోజు విశాఖలోని వీఎస్ కృష్ణా కళాశాలలో పటిష్ఠ పోలీస్ బందోబస్తు మధ్య ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రారంభించారు. ఇక్కడికి సమైక్యవాదులు రాకుండా వీఎస్ కృష్ణా కళాశాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఈ రోడ్ లో విద్యార్థులను మాత్రమే అనుమతిస్తున్నారు.