: ఇందిరాపార్క్ వేదికగా శాంతి దీక్ష
సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాలతో ఆలోచనలోపడిన తెలంగాణ వాదులు యుద్ధప్రాతిపదికన ఉద్యమ కార్యాచరణ చేపట్టారు. మరోసారి తెలంగాణ సత్తా చాటాలని, ఉద్యమాన్ని మరోసారి ఉద్ధృతం చేస్తున్నారు. దీనిలో భాగంగా నేడు హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో శాంతి దీక్ష ప్రారంభమైంది. ఈ శాంతి దీక్షలో తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం, టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు, టీఎన్జీవో నేత శ్రీనివాస్ గౌడ్ తదితరులు హాజరయ్యారు.