: ఇక రయ్ రయ్ మననున్న '108' అంబులెన్సులు
108 అత్యవసర సేవలు ఇక నుంచి పూర్తి స్థాయిలో అందనున్నాయి. వేతనాల పెంపు, పనివేళల తగ్గింపు డిమాండ్లతో 35 రోజులుగా సమ్మె చేస్తున్న సిబ్బంది ఎట్టకేలకు శాంతించారు. పెద్దగా ఫలితం లేకుండానే రాజీకి వచ్చారు. నిన్న జీవీకే యాజమాన్యంతో ఉద్యోగ సంఘం జరిపిన చర్చలు ఫలించడంతో సమ్మెకు తెరపడింది. దీంతో అంబులెన్సులు పూర్తిగా రోడ్డెక్కనున్నాయి. వేతనాల పెంపునకు మాత్రమే జీవీకే యాజమాన్యం అంగీకరించింది. ప్రతీ ఉద్యోగికి కనీసంగా 300 రూపాయల వేతనం పెరగనుంది.