: తమిళనాడులో విడుదల కాని 'మద్రాస్ కేఫ్'
బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహాం నటించి, నిర్మించిన 'మద్రాస్ కేఫ్' చిత్రం తమిళనాడు మినహా దేశవ్యాప్తంగా విడుదలయింది. ఈ చిత్రంలో ఎల్టీటీఈ సభ్యులను టెర్రరిస్టులుగా చూపారంటూ తమిళ విద్యార్ధి సంఘాలు, స్థానిక పార్టీలు వ్యతిరేకత వ్యక్తం చేశాయి. ఈ మేరకు మద్రాస్ హైకోర్టులో ఓ పిటిషన్ కూడా దాఖలైంది. దీనిని పరిశీలించిన కోర్టు 'ఫిల్మ్ సర్టిఫికెట్ బోర్డ్' క్లియరెన్స్ ఇచ్చేంతవరకు తమిళ వెర్షన్ విడుదల చేయరాదంటూ స్టే ఇచ్చింది. దాంతో, ఈ సినిమాకు బ్రేక్ పడింది.