: నాన్న గారి ఆశయ సాధనకే రాజీనామా: హరికృష్ణ


తన తండ్రి ఎన్టీఆర్ ఆశయ సాధన కోసమే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామ చేశానని నందమూరి హరికృష్ణ చెప్పారు. ప్రాంతాలు వేరైనా తెలుగువారంతా ఒక్కటిగా ఉండాలన్న ఆయన ఆకాంక్ష మేరకు ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీయే రాష్ట్ర విభజన చిచ్చు పెట్టిందని, అది దుర్మార్గ పార్టీ అని చెప్పారు. రాహుల్ ను ప్రధానిని చేయడం కోసమే ఆంధ్రప్రదేశ్ ను విభజించడానికి నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. ఎన్టీఆర్ ఆశయ సాధన మేరకు అన్ని ప్రాంతాలకు న్యాయం జరగాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఎన్టీఆర్ ఆత్మ ప్రబోధాను సారం ముందుకు వెళతానన్నారు.

  • Loading...

More Telugu News