: శ్రీవారి సేవలో బాలయ్య కుటుంబ సభ్యులు, విజయకాంత్
బాలయ్య తన చిన్నకూతురు తేజశ్విని, అల్లుడు శ్రీభరత్ తో కలిసి ఈ ఉదయం తిరుమల శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వారికి పండితులు ఆశీర్వచనం అందించారు. తేజశ్విని, శ్రీభరత్ ఈ నెల 21న దంపతులుగా మారిన సంగతి తెలిసిందే.
సినీ నటుడు విజయకాంత్ దంపతులు కూడా ఉదయం వీఐపీ ప్రారంభ దర్శనంలో స్వామిని దర్శనం చేసుకున్నారు. మరోవైపు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కూడా కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం అభిషేక సేవలో పాల్గొన్నారు. పండితులు వారికి ఆశీర్వచనం పలికారు. జస్టిస్ రమణ ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వెళ్లనున్న సంగతి తెలిసిందే.