: చిన్న మెదడే కానీ పనులు చాలానే


చక్కగా మాట్లాడడం వచ్చినవారు అలవోకగా మాట్లాడేస్తుంటారు. మరికొందరు సరిగా మాట్లాడలేరు. అయితే ఇలా మాట్లాడే సమయంలో మన పెదవులు, నాలుక వంటి వాటి మధ్య స్వర సమ్మేళనం వంటి నియంత్రణ విషయంపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. వీరి పరిశోధనల్లో ఈ చర్యలన్నింటినీ చిన్నమెదడు సమ్మేళనం చేస్తున్నట్టు తేలింది. మన మెదడులో ఉండే చిన్న మెదడు వీటన్నింటి మధ్య చక్కటి సమన్వయాన్ని కుదురుస్తున్నట్టు వీరి పరిశోధనలో తేలింది.

మాట నోటినుండి వెలువడడం అనేది మనకు వినడానికి చాలా సులువుగా ఉంటుంది. కానీ ఇది చాలా సంక్లిష్ట ప్రక్రియ. దీనికి పెదవులు, దవడలు, నాలుక, స్వరపేటిక ఇలా అన్నీ కలిసి పనిచేయాల్సి ఉంటుంది. వీటన్నింటిలో ఏది సక్రమంగా పనిచేయకున్నా మాట నోటినుండి వెలువడదు. అయితే వీటన్నింటినీ మన మెదడులోని చిన్న మెదడుకు సంబంధించిన భాగాలు సమన్వయం చేస్తుంటాయి. దీన్ని చిన్న మెదడు ఎలా చేయగలుగుతుంది? అనే విషయానికి సంబంధించి కాలిఫోర్నియా, శాన్‌ఫ్రాన్సిస్కో విశ్వవిద్యాలయాలకు చెందిన పరిశోధకులు పరిశీలించారు.

వీరి పరిశోధనలో చిన్న మెదడు భాగంలో క్రమానుగత, ఆవృత్త నిర్మాణాలు ఉంటాయని, ఇవి క్షణ కాలంలో పెదవులు, నాలుక వంటి వాటిమధ్య స్వర సమ్మేళనం వంటి నియంత్రణకు దోహదం చేస్తున్నట్టు తేలింది. మెదడుకు, కంప్యూటర్‌కు మధ్య కృత్రిమ మాటలతో అనుసంధానం చేయడానికి, మాటకు సంబంధించిన సమస్యల చికిత్సకు తాము కనుగొన్న సమాచారం చక్కగా ఉపయోగపడగలదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News