: గణేషుడి ఉత్సవాలకు పోలీసుల సూచనలు
వినాయక చవితి ఉత్సవాలపై నగర పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. నగర కమిషనరేట్ లోని ఉన్నతాధికారులతో కలిసి నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పోలీసుల అనుమతి లేకుండా మండపాలు ఏర్పాటు చేయరాదని కమిషనర్ నగర ప్రజలను ఆదేశించారు. వినాయకుడి విగ్రహాలు మండపాల్లో పెట్టేందుకు అనుమతి కోసం నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఈ నెల 29 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.