: మోడీ అడాల్ఫ్ హిట్లర్.. దిగ్విజయ్ సంచలన వ్యాఖ్యలు
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భోపాల్ లో ఆయన మాట్లాడుతూ, ఈసారి జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ తో మోడీని పోల్చారు. చరిత్ర హీనుడైన హిట్లర్ బాటలో మోడీ నడుస్తూ అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్నాడన్నారు. హిట్లర్, మోడీల మధ్య చాలా పోలికలున్నాయని దిగ్విజయ్ అన్నారు. గుజరాత్ లాంటి చిన్న రాష్ట్రం నుంచి బీజేపీ తరుపున మోడీ వెలుగులోకి వచ్చాడని, అయితే ఆ రాష్ట్రంలో మోడీ ఉన్నాడు కానీ బీజేపీ లేదని అన్నారు. మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్ లలో కూడా అదే పరిస్థితి ఉందన్నారు. ఎమ్ పీలో శివరాజ్ చౌహాన్ ఉన్నాడు, చత్తీస్ ఘడ్ లో రమణ్ సింగ్ ఉన్నారు తప్ప బీజేపీ లేదని ఎద్దేవా చేశారు. దేశంలో కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయడం మోడీకి కలగానే ఉంటుందని దిగ్విజయ్ ఘాటుగా వ్యాఖ్యానించారు.