: అఖిలపక్షం అక్కర్లేదు: టీఆర్ఎస్ వినోద్ కుమార్
తెలంగాణపై అఖిలపక్ష కమిటీని కేంద్రప్రభుత్వం వేసే ఆలోచన విరమించాలని టీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ తెలిపారు. హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో జరిగిన తెలంగాణ రాజకీయ జేఏసీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అఖిలపక్ష కమిటీ అవసరం లేదన్నారు. తెలంగాణపై సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడాలని ఆయన డిమాండ్ చేశారు.