: సీమాంధ్ర ఆందోళనల తీవ్రతను పార్టీలన్నీ గుర్తించాయి: ఎంపీ అనంత
సీమాంధ్ర ప్రజల స్వచ్ఛంద ఆందోళనల తీవ్రతను పార్టీలన్నీ గుర్తించాయని ఎంపీ అనంత వెంకట్రామి రెడ్డి అన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ సభలో తాము చేస్తున్న ఆందోళన సరైందని భావించిన పలు పార్టీలు తమ సస్పెన్షన్ ను వ్యతిరేకించాయని తెలిపారు. ప్రజల ఆందోళన తెలుసుకోవడం వల్లే పార్టీలు తమ సస్పెన్షన్ పై ధ్వజమెత్తాయని అన్నారు. గతంలో పార్టీలు తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ పార్టీ, యూపీఏ భాగస్వామ్య పక్షాలు విభజన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని వెంటకట్రామిరెడ్డి డిమాండ్ చేశారు. తాము చేసిన రాజీనామాలు ఇంకా స్పీకర్ పరిశీలనలోనే ఉన్నాయని అనంత తెలిపారు.