: పేదలకు పథకాలు అందడం లేదు: రోశయ్య


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా పేద గర్భిణులకు పౌష్టికాహారం అందటం లేదని తమిళనాడు గవర్నర్ రోశయ్య ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని తన నివాసంలో ఓ డాక్యుమెంటరీ చిత్ర సీడీని ఆవిష్కరించిన సందర్భంగా రోశయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ లఘు చిత్రం పౌష్టికాహార లోపంతో బాధపడే స్త్రీలకు అవగాహన పెంచుతుందన్నారు. తల్లి ఒడి-మన బడి పేరుతో లార్డ్ వెల్ఫేర్ సంస్థ ఈ డాక్యుమెంటరీని నిర్మించింది. గర్భిణులు పౌష్టికాహారంతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఈ సీడీలో వివరించారు.

  • Loading...

More Telugu News