: వచ్చే ఎన్నికల్లో సుష్మ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తా: దిగ్విజయ్
వచ్చే 2014 ఎన్నికల్లో మధ్యప్రదేశ్ లోని 'విదీశ' నియోజకవర్గం నుంచి పోటీచేసే ఆలోచనలో ఉన్నట్లు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, ఏపీ వ్యవహారాల కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ తెలిపారు. అయితే, సొంత పట్టణమైన రాజ్ ఘర్ నుంచి పోటీచేయాలని అనుకోవడంలేదని మీడియాతో వెల్లడించారు. 'విదీశ' నుంచి పోటీచేసేందుకు ఇప్పటినుంచి ప్రణాళికలు మొదలుపెట్టినట్లు చెప్పారు. అయితే, ఇంతవరకు ఏమి నిర్ణయించలేదని, మిగతా నియోజకవర్గాలను కూడా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం విదీశ నుంచి లోక్ సభలో సీనియర్ నేత సుష్మాస్వరాజ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.