: విపక్షాల డిమాండ్ కు దిగి వచ్చిన ప్రభుత్వం
బొగ్గు కుంభకోణానికి సంబంధించిన ఫైళ్ల గల్లంతు అంశంలో ప్రధాని సమాధానం చెప్పాలన్న విపక్షాల డిమాండ్ కు ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ముఖ్యమైన బిల్లులు పార్లమెంటు ఆమోదం పొందాల్సి ఉండడంతో ఈ వివాదం సమావేశాలకు ప్రధాన అడ్డంకిగా మారడం కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉంది. దీంతో అవసరాన్ని బట్టి ప్రధాని జోక్యం చేసుకుంటారని, ఆ చర్చ సందర్భంగా ప్రధాని మాట్లాడుతారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి కమల్ నాథ్ లోక్ సభలో తెలిపారు. ఇదే సమాచారాన్ని రాజ్యసభలో రాజీవ్ శుక్లా చెప్పారు.