: బలవంతంగా ముద్దులు పెట్టించుకున్న టీచర్ సస్పెండ్
విద్యార్ధినులచే బలవంతంగా ముద్దులు పెట్టించుకున్న టీచర్ వ్యవహారంపై మండిపడ్డ స్కూలు యాజమాన్యం ఆమెను సస్పెండ్ చేసింది. ఈ సంఘటన చైనాలోని గాన్షు ప్రాంతంలోని లింగ్జియా కౌంటీ లోని తుఖియో హై స్కూల్ లో చోటుచేసుకుంది. డిప్లోమా సర్టిఫికెట్లు అందించే ముందు విద్యార్థినులతో బలవంతంగా బుగ్గలపై ముద్దులు పెట్టించుకున్న టీచర్ జాంగ్ రున్యాపై ఫిర్యాదు అందింది. దీంతో సర్టిఫికేట్లు కావాలంటే ముద్దు పెట్టాల్సిందేనని టీచర్ చెప్పడంతో విద్యార్ధినులు ముద్దులు పెట్టారు. అనంతరం ఆ ఫోటోలు నెట్ లో హల్ చల్ చేయడంతో స్కూలు యాజమాన్యం కమిటీతో విచారణ చేయించింది. ఈ విచారణలో జాంగ్ అధ్భుతమైన టీచర్ అని తేలింది. అయినప్పటికీ ఆమె ప్రవర్తనపై మండిపడ్డ స్కూలు యాజమాన్యం సస్పెండ్ చేసింది.