: 'టెట్' పరీక్ష వాయిదా
సెప్టెంబర్ 1న జరగాల్సిన 'టెట్' (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) వాయిదా పడింది. సీమాంధ్రలోని 13 జిల్లాల్లో ఉద్యోగుల ఆందోళన కారణంగా పరీక్ష వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మళ్లీ ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. ఇప్పటికే దీనికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ కూడా ముగిసింది.