: అఖిలపక్ష కమిటీకి కమల్ నాథ్ ప్రతిపాదన
రాష్ట్ర విభజన అంశంపై అన్ని పార్టీలతో అఖిలపక్ష కమిటీ వేస్తామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్ నాథ్ ప్రతిపాదించారు. దీనిపై ఎంపీ లగడపాటి రాజగోపాల్, సీపీఐ ఎంపీ గురుదాస్ దాస్ గుప్తా టీడీపీ సభ్యులతో చర్చించారు. తమ ప్రాంత ప్రయోజనాలు కాపాడాలంటూ లోక్ సభలో టీడీపీ, కాంగ్రెస్ సభ్యులు చేస్తున్న డిమాండును దృష్టిలో పెట్టుకునే కమిటీకి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.